NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సినిమాపై పోస్ట్.. అభిమానికి డైరెక్టర్ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

Pawan Kalyan Ustaad Bhagat Singh

Pawan Kalyan Ustaad Bhagat Singh

Director Harish Shankar Reply To Fan about Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్‌ సింగ్‌’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్‌ను గబ్బర్‌ సింగ్‌ నిలబెట్టింది. అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. గబ్బర్‌ సింగ్‌ తర్వాత పవన్‌, హరీశ్‌ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటికి డైరెక్టర్ హరీశ్ శంకర్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఉస్తాద్ భగత్‌ సింగ్‌ చిత్రం ఆగిపోనుందంటూ ఎక్స్‌లో ఒకరు పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌ వరకు చేరింది. సదరు వ్యక్తికి హరీశ్ స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇచ్చారు. ‘సినిమా మొదలే కాదు అని రూమర్స్‌ వచ్చినప్పుడే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి రూమర్స్ గురించి చదివే సమయం నాకు లేదు’ అని హరీశ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఉస్తాద్ భగత్‌ సింగ్‌ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ స్పష్టం చేశారు.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన మహిళా ఫ్యాన్‌.. కారణం ఏంటంటే?

ఉస్తాద్ భగత్‌ సింగ్‌ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని హరీశ్ శంకర్‌ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో పవన్‌ కల్యాణ్ పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. సమయం దొరికినప్పుడు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్‌ సింగ్‌ సహా ఓజి, హరిహర వీరమల్లు సినిమాలు పవన్‌ పూర్తి చేయాల్సి ఉంది.

Show comments