వ్యాక్సినేషన్ పై మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ఒక్క మనిషి కూడా మిగులకుండా ప్రతీ ఒక్కరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని సూచించారు. బుధవారం బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ని ప్రతీ గ్రామం ఏదీ వదలకుండా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. వందకు వంద శాతం మొదటి డోస్, రెండో డోస్ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో జనాభా ఎక్కువ ఉంటే రూరల్ లో పని చేస్తున్న వైద్య సిబ్బంది ని పెట్టుకుని వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
ఏ జిల్లా కూడా వాక్సినేషన్ లో వెనుకపడకూడదన్నారు. వికారాబాద్ జిల్లా లో వాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఇదే తీరులో అన్ని జిల్లాలు ముందుకు సాగాలన్నారు. ప్రతీ డీఎం అండ్ హెచ్ వో ఫీల్డ్‌లో ఉండి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు అన్ని శాఖల తో సమన్వయం చేసుకుని వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వారం తర్వాత కలెక్టర్లతో ఈ విషయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా ఉండేలా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని, అదే స్ఫూర్తితో వాక్సినేషన్ లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేలా పని చేయాలన్నారు. టీమ్ వర్క్ తో ఇది సాధ్యమవుతుందని చెప్పారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!