Site icon NTV Telugu

Harish Rao: రేవంత్ రెడ్డి బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీతో కుమ్మక్కయ్యాడు

Harish Rao

Harish Rao

కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను మాజీ మంత్రి హరీష్ ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామన్నారు. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదన్నారు. ఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటిలో నేను, ఈటల, తుమ్మల ఉన్నామని తెలిపారు. సబ్ కమిటీ రిపోర్ట్ పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా అని సూచించారు.

Also Read:Rashi Khanna : టూ ఇయర్స్ తర్వాత టాలీవుడ్‌లోకి రాశీఖన్నా..

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమ్మక్కయ్యాడని తెలిపారు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది.. కమీషన్ దగ్గర అది బయట పెడతా.. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తానని హరీష్ రావు వెల్లడించారు.

Exit mobile version