NTV Telugu Site icon

Harish Rao: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతల మెడలు వంచుతాం

Harish Rao

Harish Rao

సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించుకుంటున్నాయి. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అహంకారన్ని దించాలంటే చురుక్కు పెట్టాల్సిందే అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మేడలు వంచుతామన్నారు. కాంగ్రెస్ ఓడిన గెలిచిన ప్రభుత్వం పడిపోదని.. అహంకారం మత్తులో ఉన్న కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. రైతు బంధు నుంచి ఆరు గ్యారెంటీల వరకు అన్ని తుపాకీ మాటలేనని విమర్శించారు. మీ మోసాలకు గుణపాఠాలు తప్పవువన్నారు. కొంతమంది వారి అవసరాల కోసం పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. వారి వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఖమ్మంలో ఎమ్మెల్యేలు లేకపోయినా.. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచే సంప్రదాయం ఉందన్నారు. మన స్ఫూర్తిగా ఒకరిద్దరు పని చేయకపోయినా మీరు పని చేయాలని నాయకులను కోరారు.

READ MORE:Female Doctor: “మహిళా వైద్యులు” చికిత్స అందిస్తే రోగులు బతికే అవకాశం ఎక్కువ..

రెండు మూడు నెలలో కాంగ్రెస్ నాయకులను ఊర్లోకి రానిచ్చే పరిస్థితి ఉండదని.. తన్ని తరిమేస్తారన్నారు. పోరాటాల వారసులు సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు కాంగ్రెస్ కు ఎందుకు ఊడిగం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను లెఫ్ట్ పార్టీలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయని అడిగారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు.. రేవంత్ కాంగ్రెస్ పార్టీ వేరని విమర్శించారు. రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ ఉంది అని అడిగారు. కాంగ్రెస్ వచ్చింది రంజాన్ తోపా ఆగిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ ఎప్పుడూ సెక్యులర్ పార్టేనని తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత అన్ని రెట్లు పెరిగాయన్నారు. పరిపాలన వదిలేశారని.. రేపు నామినేషన్ చివరి రోజైనా.. ఇంత వరకు అభ్యర్థి ప్రకటన లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ లో నాలుగు నెలలకే ఇంత తన్నుకుంటున్నారన్నారు. ఏడాది అయితే ఎంత తన్నుకుంటారో అని విమర్శించారు.