Female Doctor: “మహిళా వైద్యులు” చికిత్స అందిస్తే రోగులు బతికే అవకాశం ఎక్కువ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Female Doctor: మహిళా డాక్టర్లు వైద్యం అందించి రోగులు చనిపోవడం తగ్గి, బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. పురుష వైద్యులు చికిత్స అందించిన రోగులతో పోలిస్తే మహిళా వైద్యుల చికిత్సలో మరణాల రేటు తగ్గిందని తేలింది. ఈ అధ్యయనం 2016 నుండి 2019 వరకు వివిధ వైద్య పరిస్థితుల కారణంగా ఆస్పత్రిల్లో చేరిన 4,58,100 మంది మహిళా రోగులు మరియు 3,18,800 కంటే ఎక్కువ మంది మగ రోగులతో సహా 7,76,000 మందిపై అధ్యయన చేసింది.
మహిళా వైద్యులు చికిత్స చేసిన రోగుల్లో మరణాలు తక్కువగా ఉన్నట్లు, త్వరగా కోలుకున్నట్లు అధ్యయనం తేల్చింది. మహిళా వైద్యులతో చికిత్స పొందిన స్త్రీ పెషెంట్లలో మరణాల రేటు 8.15 శాతం ఉండగా.. పురుష వైద్యులు చికిత్స చేసినప్పుడు 8.38 శాతంగా ఉంది. ఇదే విధంగా లేడీ డాక్టర్లు చికిత్స చేసిన మగ రోగుల్లో మరణాల రేటు 10.15 శాతం ఉండగా.. పురుష వైద్యుల వైద్యంలో 10.23 శాతంగా ఉంది.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
Read Also: Boeing 737: టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయిన విమానం.. వీడియో వైరల్..
మహిళా వైద్యలు తమ పేషెంట్ల పట్ల ఎక్కువ సంరక్షణ అందిస్తారని ముఖ్యమైన విషయమని, అందువల్ల వీరి పర్యవేక్షణలో ఉన్న రోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతోందని పరిశోధకుడైన యుసుకు సుగావా తెలిపారు. మహిళా వైద్యులు రోగులతో మాట్లాడటం, వారి రికార్డులు చూడటం వంటి ప్రక్రియలకు ఎక్కువ సమయం కేటాయిస్తారని, మెరుగైన సంభాషణ కలిగి ఉంటారని స్టడీలో తేలింది. మహిళా వైద్యులచే చికిత్స పొందడం, ముఖ్యంగా సున్నితమైన పరీక్షల సమయంలో మహిళారోగులకు కలిగే ఇబ్బంది, అసౌకర్యం తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా మహిళా వైద్యులు తమ పేషెంట్లతో ఎక్కువ సమయం గడుపుతారని తేలింది. 2002 నుండి జరిగిన ఒక ప్రత్యేక అధ్యయనంలో మహిళా వైద్యులు సగటున 23 నిమిషాలు రోగితో గడిపారని, పురుష వైద్యులు 21 నిమిషాలు గడిపారని కనుగొన్నారు.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!