Site icon NTV Telugu

Harish Rao: మా హయాంలో ప్రాజెక్ట్ల అప్పగింతకు ఒప్పుకోలేదు..

Harish Rao

Harish Rao

ఎస్ఎల్‌బీసీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పదేళ్లలో కిలోమీట‌ర్ త‌వ్వారని ఇటీవల ప్రెస్‌మీట్‌లో రేవంత్ చెప్పారని.. కానీ తమ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వామని తెలిపారు. తాము విమర్శలు చేయాలంటే చాలా చేస్తాం.. కానీ మైక్ కట్ అవుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజు ఏపీ పోలీసులు అన్యాయంగా వచ్చారన్నారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్‌లో, నాగార్జున సాగ‌ర్ తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంటుందని… కానీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సాగ‌ర్‌ను ఏపీ కంట్రోల్‌లోకి తీసుకుందన్నారు.

Read Also: Suhas: హ్యాట్రిక్ ఇచ్చినందుకు థాంక్స్.. మరో హ్యాట్రిక్ ఇస్తారని అనుకుంటున్నాను

కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ లు అప్పచెప్పింది కాంగ్రెస్ సర్కార్… కేఆర్ఎంబీ సమావేశాలు వివరాలు చెప్పాలా అని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ ల అప్పగింతకి ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ తన పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను సొంతంగా ఏమి చెప్పండము లేదని.. కేఆర్ఎంబీ మినిట్స్ మీకు పంపుతున్న…వాటిని చదువుకోమని చెప్పండి అని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్ట్ లు అప్పగించకపోతే కేఆర్ఎంబీ నిర్వహణ ఎందుకు వస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. బడ్జెట్ లో కేఆర్ఎంబీకి నిధులు కేటాయించాము.. కానీ ఒక్క రూపాయి విడుదల చేయలేదని హరీష్ రావు తెలిపారు.

Read Also: ONGC Recruitment 2024: ONGCలో జూనియర్ కన్సల్టెంట్స్ పోస్టులు.. పూర్తి వివరాలివే..

Exit mobile version