ఖైరతాబాద్ గణేషుడిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వస్తున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే పెద్ద విగ్రహం పెట్టిన చరిత్రలో మన ఖైరతాబాద్ గణేష్‌ది అని ఆయన అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయులదని, ఈ సంస్కృతి నీ రాబోయే తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు హరీష్ రావు. ఆనాడు బాలా గంగాధర్ తిలక్ భారతీయులను ఒక్క తాటిమీదికి తేవడానికి వినాయక చవితి దేశ వ్యాప్తంగా నిర్వహించేలా చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ కలిసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గత 9 ఏళ్లు కేసీఆర్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని, అదే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
Team India: ఈ ముగ్గురు యువ ఆటగాళ్ళు మున్ముందు రికార్డులు నెలకొల్పుతారు..
దసరా అయినా, దీపావళి అయినా, బతుకమ్మైనా, బోనాలైనా, శ్రీరామనవమి అయినా, వినాయక చవితి అయినా అందరం కలిసి గొప్పగా జరుపుకునే సంస్కృతి భారతీయులకు ఉంది. ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనందరం వినాయక చవితి అనగానే ఒక జోష్ ప్రోగ్రామ్ అనుకుంటాం. కానీ ఎమోషన్ కూడా ఈ పండుగలో ఉంది. ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ దేశ ప్రజలందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలు స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించాయి. ఆ సంస్కృతిని మనందరం కొనసాగిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సంస్కృతిని కొనసాగిద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు.