NTV Telugu Site icon

Harish Rao : నేడు సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటన

Harish Rao On Bbc

Harish Rao On Bbc

సంగారెడ్డి జిల్లాలో నేడు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా నారాయణ ఖేడ్‎లో 50 పడకల ఎంసీ‎హెచ్ హాస్పిటల్‎ను ప్రారంభం చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడే కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తారు. అనంతరం సంగారెడ్డిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సర్పంచ్‎లకు జిల్లా స్థాయి అవార్డులు అందజేయనున్నారు.

Also Read : PAK vs AFG : పాక్ ను చిత్తు చేసిన ఆఫ్ఘాన్.. 7 వికెట్ల తేడాతో గెలుపు

ఇదిలా ఉంటే.. నిన్న వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ మరోసారి స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నిఖత్‌ జరీన్‌కు మంత్రి హరీష్‌రావు అభినందనలు తెలిపారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో శక్తివంతమైన పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించి బంగారు పతకం కైవసం చేసుకుంది.! నిఖత్‌కి ఇది వరుసగా రెండో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్. భారతదేశం మీ విజయాలకు గర్విస్తోంది. హృదయపూర్వక అభినందనలు నిఖత్‌ జరీన్‌’ అంటూ మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు.