NTV Telugu Site icon

Harish Rao : నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తాం..

Harish Rao

Harish Rao

Harish Rao : తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్నికి చీమ కుట్టినట్టు లేదని., బిఆర్ఎస్ పక్షాన దీక్ష విరమణ చేయమని మోతిలాల్ ని కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రాష్ట్రంలోని నిరుద్యోగులు సమస్య ఇది అన్నారు. మీ తల్లితండ్రులు బాధపడుతున్నారు, ప్రాణం ముఖ్యం అన్నాము. అయినా కూడా దీక్ష విరమణ చేయటం లేదు. ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది. కాంగ్రెస్ ఎన్నికలు ముందు హామీలు ఇచ్చి తప్పించుకుంది. ఇప్పుడు నిరుద్యోగులు గుండెలు మీద తంతున్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ పిలిపించి హామీ ఇప్పించారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతాము అన్నారు. ఎపి లో 1:100 సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ఆయన అన్నారు.

Hardik Pandya: అనుకోని విషయాలు జరిగిపోయాయి.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు!

వాళ్ళేం గొంతుమ్మే కోరికలు కోరడం లేదు. జాబ్ క్యాలెండరు ఏమైంది., గ్రూప్ 2, 3 ఉద్యోగాలు సంఖ్య పెంచాలి. జీవో 46 రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి ఎందుకు చేయడం లేదు., మెగా డిఎస్సి ఇస్తాం అని చెప్పి ఎందుకు వేయలేదని ఆయన అన్నారు. ప్రైమరీ స్కూల్ లో టీచర్లు లేరు. వాటిని వెంటనే నింపాలి. నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఎందుకు ఇస్తాలేరు. నాలుగు వేల నిరుద్యోగు భృతి ఇవ్వాలి. కిడ్నీలో, ఛాతిలో నొప్పి వస్తుందని మోతిలాల్ అంటున్నారు. మోతిలాల్ కి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చర్చలు జరపాలి. గద్దేని ఎక్కి విద్యార్థులు గుండెలు మీద తంతారా అంటూ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ కాగానే నిరుద్యోగులు సమస్యలు పైన ప్రశ్నిస్తాం, అసెంబ్లీని స్థంభిప చేస్తాం., బిఆర్ఎస్ ఎక్కడికైనా పోరాటం చేస్తుందని ఆయన ఈ సందర్బంగా అన్నారు.

Lucknow Airport: రూ.2400కోట్లతో కట్టిన ఎయిర్ పోర్టు.. ఒక్క వానకే లీకైంది