NTV Telugu Site icon

Harish Rao : పంచుడు BRS వంతు..పెంచుడు BJP వంతు

Harish Rao

Harish Rao

దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి హ‌రీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు 30 సీట్లు రావని బీజేపీ నేత సంతోష్ అన్నారని, అంటే మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రారని, ఎమ్మెల్యేలను కొనే కుట్ర బీజేపీ చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్ళు 400 ఉన్న సిలిండర్ ను 1200 కి పెంచారని, పంచుడు BRS వంతు..పెంచుడు BJP వంతు అంటూ ఆయన విమర్శలు చేశారు. మాయమాటలు చెప్పగానే ఒక్క సారి మోసపోతాం కానీ..మళ్ళీ మోసపోతమా, మంచి ఏదో చేడు ఏదో మీకు తెలుసు అని ఆయన అన్నారు. దుబ్బాకలో మా ఎమ్మెల్యే లేకపోయినా దుబ్బాక మీద కేసీఆర్ కి ఎంతో ప్రేమ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Vande Bharat Express : హౌరా రైల్వే స్టేషన్‌లో హైడ్రామా.. అసహనం వ్యక్తం చేసిన సీఎం
ఇక్కడి ఎమ్మెల్యే బీజేపీ కావచ్చు..కానీ ప్రజలు మా తెలంగాణ వాళ్ళు అని ఆయన అన్నారు. దుబ్బాక బస్టాండ్ చూస్తే కడుపు నిండిందని, సద్ది తిన్న రేవు తలవాలి మనం అని ఆయన అన్నారు. దుబ్బాకకు బస్టాండ్ ఎంపీ ప్రభాకర్ ఆడిగిండు… గోవర్ధన్ ఇచ్చిండు.. పాడి ఆవుల గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.. సెంటిమెంట్ గురించి బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తారని ఆయన ఆరోపించారు. గోవుని, సైనికుల్ని కూడా రాజకీయం కోసం వాడుకునే చరిత్ర బీజేపీది అని ఆయన మండిపడ్డారు. పెంచిన సిలిండర్ ధర ఎప్పుడు తగ్గిస్తారో, ఉన్న ఉద్యోగాలు తీసేస్తారు.. ప్రభుత్వ సంస్థలని ప్రయివేట్ చేస్తారు. ఈ దేశంలో బీజేపీ వాళ్ళు బీడీలు చేసే కార్మికులకు పెన్షన్ ఇచ్చారా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరేస్తామని ఆయన అన్నారు.