Site icon NTV Telugu

Harish Rao: ఎవరు ఎన్ని ట్రిక్స్ చేసిన.. కేసీఆర్దే హ్యాట్రిక్

Harish Rao

Harish Rao

ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో తెలంగాణ IMA ప్రెసిడెంట్ డాక్టర్ బీఎన్ రావు, పలువురు డాక్టర్లు BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలా.. లేదా రాంగ్(wrong) లీడర్ కావాలా ప్రజలు ఆలోచన చేయాలని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాంగ్ లీడర్ల చేతిలోకి పోతే రాష్ట్రం వెనక్కి పోతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఎలాంటి కర్ఫ్యూలు, అల్లర్లు లేవని హరీష్ రావు అన్నారు. మరోవైపు MBBS కోసం పక్క దేశాలు, రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు తెలంగాణాలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

Read Also: Payal Rajput : టైట్ ఫిట్ డ్రెస్ లో టెంప్టింగ్ పోజులిస్తూ రెచ్చగొడుతున్న పాయల్..

ఇక రాష్ట్రంలో ఎవరు ఎన్ని ట్రిక్స్ చేసిన.. సీఎం కేసీఆర్ దే హ్యాట్రిక్ అని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. పేపర్ లీడర్ కావాలా…ప్రాపర్ లీడర్ కావాలా అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రాపర్ లీడర్ అని.. హైదరాబాద్ హెల్త్ హబ్ గా మారుతుందని పేర్కొన్నారు. మొన్న చంద్రబాబు ఒక మంచి మాట అన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చు అని.. సీఎం కేసీఆర్ కృషి వల్లే.. రాష్ట్రంలో భూముల ధరలు మంచి డిమాండ్ ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ దగ్గర లబ్ధి పొందని మనిషి ఎవరు లేరని.. తెలంగాణతో పోటీ పడే రాష్ట్రం దేశంలో ఒక్కటి లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Exit mobile version