Harish Rao: మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం

  • రాష్ట్రంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం వ్యక్తం.
  • వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలిచిందని
  • నాడు అందని ద్రాక్షగా వైద్య విద్య
  • నేడు సాధారణ ప్రజలకు చేరువైన వైద్య విద్య అని..
Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ ఆయన తెలిపారు. తొమ్మిదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలిచిందని ఆయన అన్నారు. మెడికల్ సీట్ల సంఖ్యలో దేశంలో అగ్రస్థానలలోకి తెలంగాణ చేరుకుందని ఆయన అన్నారు. నాడు అందని ద్రాక్షగా వైద్య విద్య, నేడు సాధారణ ప్రజలకు చేరువైన వైద్య విద్య అని అన్నారు.

Baba Siddique Murder: “యూట్యూబ్” చూసి తుపాకీ కాల్చడం నేర్చుకున్న బాబా సిద్ధిక్ హత్య నిందితులు..

60 ఏళ్ల ఉమ్మడి పాలనలో 5 మెడికల్ కాలేజీలు, 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ఆ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరిందని అన్నారు. 2014 వరకు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని.. అవి నేడు 8490 సీట్లు తియ్యని తెలిపారు. ఇది కేసీఆర్ మార్క్ పాలనని, మార్పు పేరు చెప్పి ఎవరూ చెరిపేయలేని ఆల్ టైం రికార్డు అని ట్వీట్ చేశారు.