NTV Telugu Site icon

Harish Rao : రేవంత్ రెడ్డి ఆ కుర్చీకి ఉన్న గౌరవం పోగొడుతున్నారు

Harish Rao

Harish Rao

రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి ఉన్న గౌరవం పోగొడుతున్నారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. ఇవాళ మీడియాతో మాజీమంత్రి హరీష్‌ రావు చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి భాష చూసి పిల్లలు చెడిపోతారు అని.. టీవీ లు ఆపేస్తున్నారని, హైదరాబాద్ లో సముద్రం, బకారానంగళ్ ప్రాజెక్టు తెలంగాణ లో ఉంది అనే లాంటి మాటలు చెబుతున్నారన్నారు. మల్లన్న సాగర్ లో యాభై వేల ఎకరాల భూమి ముంపు కు గురి అయింది అన్నారని, అక్కడ 17 వేల ఎకరాలు మాత్రమే ముంపు గురి అయిందన్నారు. ఇలా ప్రతిసారి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ దయతో సీఎం అయ్యావు… కేసీఆర్ పై మాట్లాడే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు కామన్.. అంతమాత్రాన కేసీఆర్ పని అయిపోయింది అంటావా అని హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని, expiry మెడిసిన్ అంటే రాహుల్ గాంధీ ని అంటున్నవా అని హరీష్‌ రావు సెటైర్‌ వేశారు.

CM Revanth Reddy: కుల గణనపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..

నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారని, అలా మాట్లాడిన వాళ్ళు ఎటు పోయారో చూశామన్నారు. ముందు నీ పక్కన ఉన్నవాళ్లు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో అని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు ఎన్నికలు వస్తే 100 సీట్లు బీఆర్‌ఎస్‌కు వస్తాయని, ఓ మంత్రి గవర్నర్‌ను కలిశాడు.. ఓ మంత్రి హెలికాప్టర్ లేదని అలిగాడు.. ఓ మంత్రి ఢిల్లీ కి రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్ళాడు.. మరో ఇద్దరు ముగ్గురు మేము సీఎం అవుతాము అని సోషల్ మీడియా లో పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ పైన మా విజన్ ఎప్పుడో చెప్పామని, మూసీ రీజనరేషన్ కు మేము అనుకూలం.. కానీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మేము వ్యతిరేకమన్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మూసీకి తీసుకురావడానికి ఎప్పుడో డీపీఆర్‌ సిద్ధం అయిందన్నారు. 1100 కోట్లతో అయ్యే దానికి 7 వేల కోట్లు ఎందుకు పెడుతున్నారని, గచ్చిబౌలి లో కేసుల్లో ఉన్న 400 ఎకరాలు భూమి ని ప్రభుత్వం గెలిచిందన్నారు. ఆ భూమిలో మూపీ బాధితులకు పేదలకు 200 గజాల చొప్పున ఇవ్వండన్నారు.

Mahesh Kumar Goud: కులగణన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి..