NTV Telugu Site icon

Harish Rao: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిందే టీఆర్ఎస్..

Harish Rao

Harish Rao

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో సీఎం కామెంట్స్ పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సీఎం సభను తప్పుదోవ పట్టించారు అంటూ ఆయన తెలిపారు. రికార్డు సరిచేయండి.. పోతిరెడ్డిపాడుపై చర్చ చేయండి.. ఎవరు మాట్లాడలేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో ఉన్నాం అన్నారు.. పోతిరెడ్డిపాడు పొక్క కొట్టారు అనే బయటకు వచ్చాం.. పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బయటకు వచ్చాం.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిందే టీఆర్ఎస్.. మేము పొత్తు పెట్టుకోవడం వల్లనే.. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని హరీశ్ రావు అన్నారు.

Read Also: Yogibabu : బంఫర్ ఆఫర్ కొట్టేసిన యోగిబాబు.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్..

మాతో గొంతు కలిపింది పీజేఆర్ ఒక్కరే అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పీజేఆర్ కొడుకు కూడా ఇప్పుడు మాతోనే ఉన్నాడు.. సీఎం రేవంత్ సభను తప్పుదారి పట్టించారు.. పోతిరెడ్డిపాడుపై మా కాంగ్రెస్ నేతలు పొట్లడారు అని రేవంత్ అంటున్నారు.. పోతిరెడ్డిపాడు పైనే మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అప్పటి టీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు మంత్రులుగా 14 నెలలకే.. 6 కారణాలతో ఆ రోజు రాజీనామా చేసాం.. నేను, పద్మా రావు గౌడ్ ప్ల కార్డులు పట్టుకొని సభలో పోరాటం చేశామని ఆయన చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో మంత్రులు ఏమి మాట్లాడలేదు.. పీజేఆర్ ఆ రోజు పోతిరెడ్డిపాడు పై మాట్లాడారు.. సీఎం రేవంత్ రెడ్డి ఏబీవీపీలో మొదలు పెట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు.. ఆ తరవాత ఎక్కడ ఉంటారో?.. గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ నజర్ పెట్టాలి అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.