Site icon NTV Telugu

Harish Rao : కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలి

Harish Rao

Harish Rao

కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలన్నారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు. మెడికల్ కాలేజీల సమీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 9 కాలేజీలకు ఎన్ఎంసీ నుండి అనుమతులు పొందేలా చూడాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు మూడు రోజుల్లో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 8,9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీల ఏర్పాటు జాతీయ స్థాయిలో రికార్డు అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Bhatti Vikaramarka : దేశ సంపదను ప్రధాని మోడీ క్రోనీ క్యాపిటలిస్ట్‌లకు దోచిపెడుతున్నారు

ఈనెల 28న 9 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రిన్సిపాల్స్, ఇంజినీర్లతో పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని హరీష్ రావు అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు చెప్పారు. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు.

Also Read : Kadiyam Srihari : బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.. కడియం హాట్‌ కామెంట్స్‌

Exit mobile version