Site icon NTV Telugu

Harish Rao: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు..

Harish Rao

Harish Rao

Harish Rao: కేంద్రబడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అంటూ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు.. కిషన్ రెడ్డి ,బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నలు గుప్పించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదీ ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు.. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అంటూ హరీశ్‌ రావు పేర్కొన్నారు.

Read Also: Union Budget 2024: కేంద్ర బడ్జెట్ పై స్పందించిన కేటీఆర్..

రాష్ట్రంలోని కాంగ్రెస్‌పై ప్రభుత్వంపై హరీశ్‌ రావు విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం హామీల ఎగవేతనే కాదు ..ఆసెంబ్లీ సమయంపై ఎగవేత ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల్లో కుదిస్తున్నారని.. కనీసం 15 రోజులు సమావేశాలు జరపాలని డిమాండ్ చేశామన్నారు. డిమాండ్లపై రెండు రోజులే చర్చ జరపడం దారుణమన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో తొమ్మిది రోజులు డిమాండ్ల పై చర్చ జరిగేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు పెంచాలన్న కాంగ్రెస్ ఇపుడు ఎం చేస్తోందని ప్రశ్నించారు. పాలక పక్షం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. రేపటి ఎజెండా ఇంకా ఖరారు చేయలేదని.. ఈ సాయంత్రం రేపటి చర్చను నిర్ణయిస్తే సభ్యులు ఎలా సిద్ధమవుతారని అన్నారు. నిరుద్యోగుల అంశంపై రేపు చర్చా చేపట్టాలన్నామని.. తొమ్మిది అంశాలను చర్చకు ప్రతిపాదించామని హరీశ్ తెలిపారు. శాంతి భద్రతల వైఫల్యం ,చేనేత కార్మికుల ఆత్మహత్యలు ,గ్యారంటీలు చట్టబద్ధత ,రైతు రుణమాఫీ ఆంక్షలు ,అన్ని పంటలకు బోనస్ రైతు భరోసా ,పల్లె లు పట్టణాల్లో పారిశుధ్య లోపం స్థానిక సంస్థలకు నిధులు ,ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు లాంటి తొమ్మిది అంశాలు చర్చను పెట్టాలని కోరామన్నారు.

Exit mobile version