NTV Telugu Site icon

Harish Rao: కూనంనేని వ్యాఖ్యలకు హరీష్ రావు అభ్యంతరం..

Harish Rao Challenge

Harish Rao Challenge

సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్‌ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా.. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

Read Also: Kishan Reddy: అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయండి.. కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని హరీశ్‌రావు అన్నారు. ‘కూనంనేని సాంబశివరావు సీపీఐ ఎమ్మెల్యే. వారి పార్టీ కాంగ్రెస్‌కు మిత్ర పక్షం. ఇద్దరు కలిసి పోటీ చేశారు. మేం ఇంటికి ఒక ఉద్యోగమిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. తాము అలా చెప్పినట్లు నిరూపించాలని ఛాలెంజ్‌ విసిరారు. గవర్నర్‌ స్పీచ్‌పై కూనంనేని మాట్లాడితే బాగుంటుంది’అని హరీశ్‌రావు అన్నారు. అనంతరం కూనంనేని మళ్లీ మాట్లడడం ప్రారంభించిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కాగా.. కూనంనేని వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ మద్ధతుగా ఉన్నారు. ఇది పద్దతి కాదు.. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు.. మాట్లాడనివ్వండని పొన్నం తెలిపారు.

Read Also: Koonamaneni: కమిట్మెంట్తో ఇచ్చిన హామీలు అమలు చేయండి