NTV Telugu Site icon

Harish Rao: సీఎం అబద్ధాల్లో గిన్నిస్ బుక్‌ రికార్డులోకి ఎక్కుతారు..

Harish Rao

Harish Rao

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. 7 రోజుల పాటు సాగిన సమావేశాలు.. నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఎం తీరు గజ్జెల లాగు వేసుకొని కొరడాతో తనని తానే కొట్టుకున్నట్లు ఉందని విమర్శించారు. సీఎం కాబట్టి మైక్ దొరికింది అని మాట్లాడారు.. తమకు మాత్రం మైక్ ఇవ్వనివ్వలేదని అన్నారు. సీఎం అబద్ధాల్లో గిన్నిస్ బుక్ రికార్డ్‌లోకి ఎక్కుతారని ఎద్దేవా చేశారు. సీఎం మాట్లాడిన రెండు గంటల ప్రసంగంలో అన్ని అబద్ధాలేనని అన్నారు.

Read Also: GST Council meeting: పాత వాహనాలు కొంటున్నారా? షాక్ ఇచ్చిన జీఎస్టీ కౌన్సిల్

ఫార్మా సిటీలో విలువైన భూములు సేకరించి.. అగ్గువకు కంపెనీలకు ఇచ్చామన్నారు.. ఒక్క కంపెనీకి కూడా ఇవ్వలేదు.. ఇంకా తక్కువకు ఇవ్వడం ఎలా ఉంటుందని హరీష్ రావు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని సవాలు విసిరాను.. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమాపై క్లారిటీ ఇవ్వలేదని హరీష్ తెలిపారు. మరోవైపు.. ఎస్ఎల్‌బీసీని బీఆర్ఎస్ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని అన్నారు.. తాము 11 కిలోమీటర్లకు పైగా తవ్వామని హరీష్ రావు చెప్పారు. అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యవహారంపై సీఎం మాట్లాడారు.. తమకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదని అన్నారు. అయినా తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడం దురదృష్టకరం అని హరీష్ రావు తెలిపారు. మీ సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ మీ తమ్ముడు పేరు రాసి చనిపోయారు.. మీ తమ్ముడుని ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వాంకిడిలో విద్యార్థిని శైలజ చనిపోతే ఎందుకు పరమర్శించలేదని అన్నారు.

Read Also: Pawan Kalyan: పవన్ సర్కారులో భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో ఉన్నట్టే..

అసెంబ్లీని గాంధీ భవన్‌లాగా మార్చారని హరీష్ రావు అన్నారు. పది సంవత్సరాలు గాంధీ భవన్‌లో చెప్పిన విషయాలే ఇక్కడ చెబుతున్నారని ఆరోపించారు. మరోవైపు.. ఫార్ములా ఈ రేస్ మీద చర్చించాలి అని అడిగాము.. కానీ చర్చించలేదన్నారు. మొదటి రోజు అసెంబ్లీ పెట్టి ఆరు రోజులు సెలవులు ఇచ్చారు.. సోనియాగాంధీ బర్త్ డే అని డిసెంబర్ 9న అసెంబ్లీ పెట్టారన్నారు. ఆమె పుట్టిన సంవత్సరం 1947 నెంబర్‌తో జీవో ఇచ్చారు.. ఇలా బర్త్ డేల కోసం అసెంబ్లీని పెడుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు.

Show comments