NTV Telugu Site icon

Harish Rao: మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల హరీష్ రావు ఫైర్..

Harish Rao

Harish Rao

MLA Harish Rao: అసెంబ్లీలో బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి వెంటనే బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని., పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామని., ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఆయన అన్నారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయం అని ఆయన అన్నారు.

Somireddy: సర్వేపల్లిలో జరిగిన అక్రమాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం..

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా.?., రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీడయడమే మేము చేసిన తప్పా.?., విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే మేము చేస్తున్న తప్పా.? మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నరు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు..

IPL 2025 Mega Auction: ఎనిమిది మందికి అవకాశం ఇవ్వండి.. టాప్ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ విజ్ఞప్తి!

Show comments