Site icon NTV Telugu

Phone Tapping Case:: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టులో హరీష్ రావుకు ఊరట!

Harish Rao Phone Tapping Case

Harish Rao Phone Tapping Case

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హరీశ్‌ రావుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‍ (SLP) జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం కొట్టేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావుకు కూడా ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలను వినిపించారు.

Also Read: Minister Seethakka: మహిళా సాధికారత, సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం!

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావుపై గతంలో కేసు నమోదయింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు హరీష్​ రావు. విచారణ జరిపిన హైకోర్టు హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్‎ను క్వాష్ చేసింది. దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును చక్రధర్ గౌడ్ ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చక్రధర్ గౌడ్ పిటిషన్లోనే హరీష్ రావు విచారణకు అనుమతించాలని కోరింది. ఈరోజు (జనవరి 5న ) రెండు పిటిషన్లను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోవాలని స్పష్టం చేసింది.

Exit mobile version