T. Harish Rao: మంత్రికి మతిభ్రమించింది.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించిందని.. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. “ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. నేను అమెరికా వెళ్లి, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం. రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలి. నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి.కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి గారు మాట్లాడటం చౌకబారుతనం.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: AC: ఏసీలు పేలకుండా ఉండాలంటే ఇలా చేయండి.. లేదంటే ప్రమాదం
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
“కోమటిరెడ్డి గారి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తున్నాను. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. కోమటిరెడ్డి గారు చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తాను, మీ ఆధారాలతో మీరు రండి. టీవీల్లో బ్రేకింగ్ స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలి. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి గారు తన హుందాతనాన్ని నిలుపుకోవాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఆ భగవంతుడు మీకు సద్భుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.” అని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!