నిర్వహణలోపం వల్ల ఏసీల్లో పేలుడు సంభవిస్తుంటుంది.

కంప్రెసర్ అధిక ఉష్ణోగ్రతల వద్ద నిరంతరం నడుస్తుంటే, పేలుడు సంభవించే అవకాశం ఉంది.

ప్రతి 6 నెలలకు లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి ఏసీ రిపేరర్ ద్వారా సర్వీస్‌ను పొందండి.

కంప్రెసర్‌లో రిఫ్రిజెరాంట్ గ్యాస్ లీకేజ్ కూడా పేలుడుకు కారణమవుతుంది.

స్థిరమైన వోల్టేజ్ హెచ్చుతగ్గులు కంప్రెసర్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ఏ రకమైన లీకేజీ అయినా, వెంటనే సాంకేతిక నిపుణుడిని పిలిచి మరమ్మతు చేయండి.

ఎయిర్ ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి.  

కంప్రెసర్‌ను సూర్యకాంతి, ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాలలో పెట్టరాదు

కూలింగ్‌ ఫ్యాన్ సరిగ్గా పని చేస్తుందో లేదో తనిఖీ చేస్తుండాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.