NTV Telugu Site icon

Harish Rao : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకి అన్యాయం చేస్తున్నాయి

Harish Rao

Harish Rao

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన దుబ్బాకలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకి అన్యాయం చేస్తున్నాయన్నారు. బీజేపీ అడుగులకు మాడుగుల ఒత్తే పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని బీజేపీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్ అని మాట తప్పి ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు.

Also Read : Tokyo-Haneda airport: ఎయిర్‌పోర్టులో ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ 379 మంది..

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటామన్నారు కొనలేదని, రైతుభరోసా 15 వేలు ఇస్తామని చెప్పి 10 వేలు కూడా ఇవ్వలేదన్నారు హరీష్‌ రావు. కరోనా వచ్చినప్పుడు కూడా రైతుబంధుని కేసీఆర్ ఆపలేదని, 4 వేలు పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ అధికారంలోకి రాగానే చేస్తాం అన్నారు అందుకే గుర్తు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు తొందరపడుతున్నారు అంటున్నారని, నేను తొందర పడట్లేదు ప్రజల తరపున ప్రతిపక్షంలో ఉండి గుర్తుచేస్తున్నానని ఆయన అన్నారు. ఈ ఓటమి మనకి స్పీడ్ బ్రేకర్ లాంటిది.. మళ్ళీ పికప్ అందుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకి బీఆర్‌ఎస్‌ పార్టీయే శ్రీ రామ రక్ష అని ఆయన అన్నారు. ప్రజలకు నచ్చని నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందామన్నారు.

TDP – Janasena New Logo: ఎన్నికల ప్రచారానికి టీడీపీ-జనసేన కొత్త లోగో..