NTV Telugu Site icon

Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువును వెంట తీసుకువచ్చింది

Harish Rao Rahul Gandhi

Harish Rao Rahul Gandhi

ఎన్నికల్లో ప్రియాంకా గాంధీతో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి, నిండు అసెంబ్లీలో చేతులెత్తేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువును వెంట తీసుకువచ్చిందన్నారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి 150 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేశాడు…వెటర్నరీ కళాశాలను కొడంగల్ కు తీసుకుపోయాడని, దేవున్ని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీ కే దక్కుతుందన్నారు కిషన్‌ రెడ్డి. కేసీఆర్ అంత భక్తుడు ఎవరన్నా ఉన్నారా, ఆయన చేసిన యజ్ఞ, యాగాదులు ఎవరన్నా చేశారా అని ఆయన ప్రశ్నించారు. రఘునందన్ రావు డోఖా చేయడంతోనే దుబ్బాకలో ఓడగొట్టారు..

 Pushpa 2 : వామ్మో.. ఆ ఒక్క సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టవా సుక్కు..?

ఈ సారి కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంట్, సాగునీరు ఇచ్చారని గుర్తుచేశారని హరీష్‌ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరువు తెచ్చిందని విమర్శించారు. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల రుణమాఫీ అయినా రైతులు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి… రుణామాఫీ కానివారు బీఆర్ఎస్‌కి ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఓట్లు కోసం వచ్చే ఆ పార్టీ నేతలను మహిళలు చీపురు కట్టలతో తరమాలాని వార్నిగ్ ఇచ్చారు.

  Maheshwar Reddy : ఇప్పుడు లోలోపల సెటిల్మెంట్ లు బయటకు వస్తున్నాయి