సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 229 మందికి 56 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, రెండు పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకి మోసం చేశాయన్నారు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని, బీజేపీకి ఆంధ్రా తీపి అయింది… తెలంగాణ చేదు అయ్యిందా..? అని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలిపోతే కాళేశ్వరం మొత్తం కూలి పోయిందని ప్రచారం చేశారని, కాళేశ్వరం కూలి పోతే రంగనాయక సాగర్ లో నీళ్లు ఎలా వచ్చాయి..? అని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా, గోదావరి జలాలు, రైలు, మెడికల్ కాలేజ్ అన్ని కెసిఆర్ తోనే సాధ్యం అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Himachal Pradesh: శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం.. కారు వాగులో కొట్టుకుపోయి 11 మంది మృతి
తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే.. ఆ పార్టీ మాత్రం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని హరీష్ రావు విమర్శించారు. బీజేపీకి ఆంధ్రా తీపి అయ్యింది.. తెలంగాణ చేదు అయ్యిందా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మహిళకు ఇస్తానన్న రూ. 2,500 ముచ్చట లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు బెల్టు షాపులను బంద్ చేస్తామని చెప్పిందని.. ఇప్పుడు మాత్రం గల్లీ గల్లీకో బెల్ట్ షాప్ పెట్టిస్తోందని దుయ్యబట్టారు.