NTV Telugu Site icon

Harish Rao : ఎవరిమీద దాడి చేయాలని రివ్యూ చేస్తారా మీరు

Harish Rao

Harish Rao

రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, దీనికి కారణం ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేసేదంతా చేసి శాంతిభద్రతలపై రివ్యూ నిర్వహిస్తున్నారు అంటున్నారని, నిన్న ఏమైంది లా అండ్ ఆర్డర్ ? నిన్న ఆపి ఉంటే శాంతి భద్రతల సమస్యలు వచ్చేవి కావుకదా ! అని ఆయన అన్నారు. నిన్న యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా డీజీపీ గారు.. ఎవరిమీద దాడి చేయాలని రివ్యూ చేస్తారా మీరు అని ఆయన ప్రశ్నించారు. పదిరోజులు అయినా ఖమ్మం లో మాపై దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని రాచ మర్యాదలు చేశారన్నారు హరీష్‌ రావు. మీరే రెచ్చగోడుతున్నారు ‌‌. సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలని, బజారు భాష మాట్లాడుతున్నాడన్నారు హరీష్‌ రావు. కేసీఆర్ నాయకత్వం లో పనిచేసినప్పుడు గాంధీ, దానం ఇలా ఇప్పుడైనా మాట్లాడారా.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తే దాడులు చేయమని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

జీ తెలుగు ఆదివారం హంగామా

అంతేకాకుండా..’ఇదే హౌస్ అరెస్టు నిన్న గాంధీ ని చేస్తే జరిగేదా. ఇది రేవంత్ రెడ్డి ఎజెండా.. ఆయన చేయించిన దాడి గానే చూస్తాం. ఉద్యమం లో కూడా ఇలాంటి పాలన చూడలేదు. ఎమర్జెన్సీ ని మించిన పాలన నేడు సాగుతోంది. మా నేతలపై దాడులు మీ ప్రేరణ తోనే జరుగుతున్నాయి. డీజీపీ చాలా పెద్ద పదవి… జాగ్రత్తగా వ్యవహరించాలి. పోలీసులను పట్టుకోని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. పోలీసులు విచక్షణ తో, న్యాయబద్ధంగా వ్యవహరించాలి. రాహుల్ గాంధీ అమెరికా లో లెక్చర్ లు ఇస్తున్నారు. నీ లెక్షర్ ను తరువాత ఇవ్వొచ్చు కానీ మీ పార్టీ నేతలు ను రాజ్యాంగ బద్దంగా వ్యవహరించమనీ చెప్పాలి. కౌశిక్ రెడ్డి, గాంధీ లు మధ్య గొడవగా చిత్రీకరించారు. రాజ్యాంగ ఉల్లంఘన కాదు లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలపై మేం మాట్లాడితే డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడిన సమయం వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెబుతారు.

Kolkata Doctor Case: వైద్యురాలికి న్యాయం చేయాలి.. జోక్యం కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి ఆర్‌జీ కర్ వైద్యుల లేఖ..

మాకు దాడులు కొత్తకాదు … ఉద్యమం లో ఎన్నో దాడులు ఎదుర్కొన్నాం. ఎన్ని రాల్లు వేసిన ఆ రాల్లతో మా ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం గా వాడుకుంటాం. 16వ ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టి వాదన వినిపించాం. ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పం కోసం పనిచేస్తాం. గృహ నిర్బంధాలు చేస్తున్నారు.. అయినా పోలీసుల గౌరవం పోకూడదు అని మేం సహకరిస్తాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం పాడుకావొద్దు అని మేం సుయమనం తో ఉన్నాం. ఆంధ్ర ప్రాంత ప్రజలపై రేవంత్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్ ప్రజలు అందరూ మా వారే అనుకున్నారు. నీవు డిఫెన్స్ లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామాలు చేస్తారు. పీఏసీ చైర్మన్ విషయం లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. పీఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నారు. అది ఎలక్షన్ కాదు సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎలక్షన్ ఎక్కడ జరిగింది… అసెంబ్లీ ఎక్కడ సమావేశ పరిచారు. దాడి చేయించిందే నీవు.. తెలంగాణ పోలీసులు అద్బుతం గా పనిచేస్తారు. తోపులాట లో దెబ్బతగిలింది. 15 లేదు రోజుల పాటు ఫిజియోథెరపీ చేయమన్నారు. ఎంఆర్ఐ పరీక్ష చేసి ఫిజియోథెరపీ చేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరెస్టు లను ఖండిస్తున్నాం.. వెంటనే విడుదల చేయాలి. కౌశిక్ రెడ్డిని గాంధీ రెచ్చగొట్టారు .. దానికి సమాధానం చెప్పారు. హైదరాబాద్ లో ఉండే సెటిలర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు కావు’ అని హరీష్‌ రావు అన్నారు.

Show comments