NTV Telugu Site icon

Harish Rao: ఈ సారి కూడా మెదక్‌ గడ్డపై బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం

Harish Rao

Harish Rao

Harish Rao: కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.

Read Also: Andhra Pradesh: ‘మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా ’

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగులాగా ఉందన్నారు. ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందని హరీష్ విమర్శించారు. ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకు రాని హస్తంలాగా తయారయ్యిందన్నారు. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందని.. ఈ సారి కూడా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.