NTV Telugu Site icon

Harish Rao : బీజేపీ పాలిత రాష్ట్రాలలో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతోంది

Harish Rao

Harish Rao

సిద్దిపేటలోని శ్రీనివాస టాకీసులో బీఆర్ టీయూ-ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే సభ నిర్వహించారు. ఈ సభకి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాల రాస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందని, బీజేపీ పాలిత 16 రాష్ట్రాలలో బీడీలు చేసే కార్మికులను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఆ విషయం మహిళా మంత్రి అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అలసి పోకుండా నిరంతరం వెలుగును ఇచ్చేవాడు సూర్యుడు అని, అలసిపోకుండా ప్రపంచానికి సేవ చేసే వాడు కార్మికుడని ఆయన అన్నారు. కార్మికులకు కులం, మతం లేదని, కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పని చేస్తుందన్నారు మంత్రి హరీష్‌ రావు. కార్మికులను గుర్తించాల్సిన బాధ్యత అన్నీ ప్రభుత్వాలపై ఉందన్నారు.

Also Read : Revanth Reddy : ఓఆర్‌ఆర్‌ అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోంది

త్వరలోనే ఈఎస్ఐ – డిస్పెన్సరీ కార్మికులకు కోసం తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు బతుకుతెరువు కోసం ఈ ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారి బతుకు తెరువు కోసం తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్, రాష్ట్ర కార్యదర్శి మంచే నర్సింహులు, ఎల్లు రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష.. అదనంగా 2,100 ఎంబీబీఎస్‌ సీట్లు