Site icon NTV Telugu

Harish Rao: కేటీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి..!

Harish Rao

Harish Rao

Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులపై కౌంటర్ వేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై జరుగుతున్న విచారణల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. లొట్టపీసు కేసులో కేటీఆర్ విచారణకు వెళ్లి వచ్చారు. కానీ, ఇది కేవలం రాజకీయ కక్షనే అని అన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 14 నెలల కాలంలో కేటీఆర్‌పై 14 కేసులు పెట్టారు. ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ కోసం జరుగుతున్నాయని ఆరోపించారు.

Read Also: KTR: జైలుకు పంపాలనుకుంటున్నారు.. ఒక్క రూపాయి కాదు, ఒక్క పైసా కూడా పోలేదు..!

ప్రస్తుతం రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని, ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెడుతూ ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. దగ్గినా.. తుమ్మినా.. కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు. ఇక కేటీఆర్ సామర్థ్యాన్ని వివరిస్తూ.. “కేటీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి” అని అన్నారు. ఆయనను ముట్టుకుంటే బస్మం అయిపోతారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, నాయకత్వ గుణాలు, కృషి ఏ రాజకీయ కుట్రలకైనా సమాధానం అవుతాయని పేర్కొన్నారు.

Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!

Exit mobile version