NTV Telugu Site icon

Harish Rao : సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్‌ రావు సవాల్‌.. దానిపై చర్చకు సిద్ధమా..!

Harish Rao

Harish Rao

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట్ట ముంచిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ముంచింది కాక సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన నేను బహిరంగ చర్చకు సిద్ధమని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు రైతులకు అమాలయ్యాయా..? అని ఆయన వ్యాఖ్యానించారు. 15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి 12 వేలు ఇస్తున్నారని, వానాకాలం గుండు సున్నా ఇచ్చి యాసంగిలో కోతలు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో వస్తే 15 వేల హామీ ఏమైంది అని నిలదీయండని, మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకే పంటకు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు హరీష్‌ రావు. కౌలు రైతులకు ఇచ్చిన హామీ ఏమైందో రేవంత్ కే తెలియాలన్నారు. వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామన్న సీఎం రేవంత్ ఇప్పుడు కేవలం 10 లక్షల మందికే ఇస్తాం అంటున్నారని, మన రాష్ట్రంలో ఒక కోటి 2 లక్షల మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికి ఇస్తే ఇదేం నీతి..? అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలప్పుడు మాటల కోటలు ఎన్నికలు అయిపోయాక కోతలు అని ఆయన మండిపడ్డారు. ఓ ఎకరం భూమి ఉన్న రైతులను వ్యవసాయ కూలీలుగా గుర్తించి 12 వేలు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ తరపున డిమాండ్ చేస్తున్నామని, వ్యవసాయ కూలీలను గుర్తించేటప్పుడు కనీసం సోయి ఉండాలి కదా..? బుద్ది ఉందా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరం లోపు భూమి ఉన్న వారిని రైతులుగా గుర్తిస్తే వాళ్ళు నష్టపోతారని ఆయన అన్నారు. రుణమాఫీ అయిపోయింది 20 వేల కోట్లు చేశాం అంటున్నారని, కానీ ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. లక్ష లోపు, రెండు లక్షల పైన ఉన్న రుణాలు కూడా రుణమాఫీ కాలేదని, సీఎం చెప్పిన ఆగస్టు 15 గడువు ఐపాయే… కొత్త సంవత్సరం వచ్చింది మళ్ళీ ఇంకో ఆగస్టు 15 వస్తుందన్నారు.

Drugs Mafia: రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్‭ను కొలిమిలో తగలబెట్టిన పోలీసులు.. ఎందుకంటే?

నేను రైతుల గురించి మాట్లాడితే చిల్లర గాళ్లతో నన్ను సీఎం రేవంత్ తిట్టిస్తారని, నా ఇంటికి గుండాలను పంపుతారని, పంటల బీమా పథకం అటకెక్కింది…పంటకు బోనస్ అని మోసం చేశారన్నారు. 2023-24 సంవత్సరానికి 15 వేలు ఇవ్వాల్సిన రైతు భరోసా 6 వేలే ఇస్తాం అంటున్నారని, తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పార్టీని రైతులు తిడుతున్నారన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ పై, కౌశిక్ రెడ్డి పై, నా ఆఫీస్ పై, అల్లు అర్జున్ ఇంటిపై, BRS ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని, నిన్న యాదాద్రి లో BRS పార్టీ కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడులు చేయించినట్టు వీడియోలు ఉన్నాయన్నారు హరీష్‌ రావు.

హోంమంత్రి గా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారని, ఆయన మోసంతో దాడుల వెనుక ఆయన హస్తం ఉందని ప్రజలకి అనుమానం కలుగుతోందన్నారు. ప్రజా పాలన కేవలం పేపర్ పై ఉంది ప్రతీకార పాలన రాష్ట్రంలో నడుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ఠలా మార్చేశారని, ఆరు గ్యారెంటీల గురించి అడిగితే మాపై దాడులు చేయిస్తారా..? అని హరీష్‌ రావు ఫైర్‌ అన్నారు. పోలీసులను ప్రతిపక్షం చుట్టే తిప్పడం వల్ల తెలంగాణలో 23 శాతం క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. సీఎం రేవంత్ ఈ హింస రాజకీయాలు వెంటనే ఆపాలి..కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కూడా దాడులపై జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Jyothula Nehru: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Show comments