Site icon NTV Telugu

Harish Rao : దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే…!

Allu Arjun Harish Rao

Allu Arjun Harish Rao

Harish Rao : జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్‌ వేదికగా స్పందించారు. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని ఆయన అన్నారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే అని హరీష్‌ రావు మండిపడ్డారు. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు? అని ఆయన ప్రశ్నించారు.

Deputy CM Pawan Kalyan: వికసిత భారత్‌లో భాగమే స్వర్ణాంధ్ర@2047.. సీఎం ఓపికని మెచ్చుకోవాలి..

రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? అని హరీష్‌ రావు అన్నారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదని హరీష్‌ రావు అన్నారు.

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ సంచలన ట్వీట్

Exit mobile version