Harish Rao : దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే…!
- అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన హరీష్ రావు
- అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?
- ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని ఆయన అన్నారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే అని హరీష్ రావు మండిపడ్డారు. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు? అని ఆయన ప్రశ్నించారు.
Deputy CM Pawan Kalyan: వికసిత భారత్‌లో భాగమే స్వర్ణాంధ్ర@2047.. సీఎం ఓపికని మెచ్చుకోవాలి..
Also Read
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? అని హరీష్ రావు అన్నారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదని హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
-
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
-
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!