Site icon NTV Telugu

Harish Rao : కేసీఆర్ దెబ్బకు కేంద్రం తగ్గింది

Harish Rao

Harish Rao

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల నిరసనలకు ఇప్పటికే రాజకీయ పార్టీలు సైతం మద్దుతు తెలిపాయి. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్ కొనేందుకు సిద్ధమని అందుకు బిడ్‌ కూడా వేస్తామంటు వ్యాఖ్యానించారు. అయితే.. అనూహ్యంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గింది. స్టీల్‌ ప్లాంట్‌ అధికారులతో మంతనాలు జరుపుతోంది కేంద్రం.

Also Read : Jio Studios : శుభవార్త.. జియో కంపెనీ మరో విప్లవం సృష్టించనుంది

అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును అమ్మకూడదు అని కేసీఆర్ కొట్లాడారని, 27 వేల మంది కార్మికుల పక్షాన కేసీఆర్ నిలిచారన్నారు. దీనితో కేంద్ర మంత్రి ప్రకటన చేశారని, విశాఖ ఉక్కు అమ్మట్లేదు అని చెప్పారని ఆయన అన్నారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం తగ్గిందని, ఇది బీఆర్‌ఎస్‌ విజయమని హరీష్‌ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్‌ రావు.

Also Read : Heat Wave Warning: భానుడి భగభగ.. వచ్చే ఐదు రోజుల్లో 3-5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల

ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ వెల్లడించారు. గురువారం ఆయన విశాఖకు వచ్చి.. మీడియాతో మాట్లాడుతూ… ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు.

Exit mobile version