ఖమ్మం వచ్చినప్పుడల్లా కొన్ని నేర్చుకొని పోతున్నా….అది ముమ్మాటికి నిజం అని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. మీ లకరం, డివైడర్, చెట్లు అన్నీ ఫోటోలు తీసుకొని నేను నా ప్రాంతాన్ని అలానే అభివృద్ధి చేసుకున్నానని, పాత ఖమ్మంకు ఇప్పటి ఖమ్మంకు పోలికే లేదన్నారు మంత్రి హరీష్ రావు. ఒక ఖమ్మం మాత్రమే 12 వందల కోట్ల అభివృద్ధి జరిగిందని, బీజేపీ పార్టీ దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు ఇస్తే…తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అయినా మనం ఇచ్చుకున్నామని, రైతు బంధును పేరు మార్చి ఇస్తున్నారన్నారు.
Also Read : Ram Charan: లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన మెగాపవర్ స్టార్…
ముచ్చటగా 3వ సారి కూడా మనదే విజయమన్నారు. కాంగ్రెస్ పని ఖతం అయినట్లేనని, బీజేపీలో చేరేటోళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లే అని మంత్రి హరీష్ రావు అన్నారు. మతతత్వ పార్టీలకు ఇక్కడ ఓట్లు పడతాయా అని ఆయన అన్నారు. అయితే.. ఈనెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఖమ్మం సభ బాధ్యతలను హరీష్‌రావు అప్పగించడంతో ఆయన ఖమ్మంలో సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్ నేతలతో ముచ్చటిస్తున్నారు.