NTV Telugu Site icon

Harish Rao : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది

Harish Rao

Harish Rao

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. PAC చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షంకి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కె పూడికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. లోక్ సభలో PaC చైర్మన్ KC వేణుగోపాల్ కి ఇవ్వలేదా అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకుని లోక్ సభలో మాట్లాడతారని, రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురుంచి 16 వ ఆర్థిక సంఘానికి నివేదిక ఇచ్చామని, కేసీఆర్ హయంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించామన్నారు హరీష్‌ రావు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావల్సిన 41 శాతం వాటలో 31 శాతం మాత్రమే వస్తుందన్నారు హరీష్‌ రావు. నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు కూడా రావడం లేదని కమీషన్ కు వివరించామన్నారు. ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం కేంద్రం నిధులు కేటాయించిక పోవడం రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే అని ఆయన అన్నారు.

Rajini Kanth: మనసిలాయో అంటున్న రజనీకాంత్

అంతేకాకుండా..’సెస్సులు, సర్ చార్జీలంటూ కేంద్రం రాష్ట్రాలకు రావాల్సిన వాటాల్లో కోత లు విధిస్తుంది.. అభివృద్ధి చెందిన రాష్ట్రం కాబట్టి తక్కువ నిధులు ఇస్తామనడం కరెక్ట్ కాదని చెప్పాం.. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూనే అభి వృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపాం.. స్థానిక సంస్థలకు 50 శాతం గ్రాంట్లు పెంచాలని ఫైనాన్స్ కమీషన్ కు తెలిపాం.. నీటి ప్రాజెక్టుల మెయింటెన్స్ కు 40 వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక సంఘాన్ని కోరాం.. రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న తెలంగాణకు ఇచ్చే నిధులను పెంచాలని తెలిపాం..’అని హరీష్‌ రావు అన్నారు.

Rashmika Mandanna: రష్మిక’కి ప్రమాదం.. ఏమైందంటే?