ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మీంచి అమలు చేయలేరని, మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడన్నారు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలన్నారు హరీష్ రావు. ఇది పరీక్షా సమయం .మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్నారు హరీష్ రావు. కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందన్నారు హరీష్ రావు. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయని హరీష్ రావు అన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని ఆయన అన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుకు మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 100 రోజులు డెడ్ లైన్ పూర్తి అవుతోందని.. అప్పటిలోగా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎలక్షన్ కోడ్ పేరుతో కాంగ్రెస్ హామీల అమలును వాయిదా వేసే అవకాశం ఉందని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ప్రజా పోరాటం చేస్తోందని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి ఎక్కువ కార్పొరేటర్ల సీట్లు గెల్చిందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని.. అసెంబ్లీ ఎన్నికలల్లో నగర ఓటర్లు నిరూపించారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఈ సందర్భంగా హరీష్ రావు ఆరోపించారు.
