నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే నాకు ఎంతో ఇష్టం. తెలంగాణ ఉద్యమం లో కలిసి పనిచేసిన అనుభందం మాది అని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నర్సంపేటకు మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరు ఊహించరని, ఎవరు ఊహించని దానిని ఆచరణలో నాయకులు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి జిల్లా కు మెడికల్ కళాశాల మంజూరు చేసిన ఘనత సిఎం కేసీఆర్ దే అని ఆయన అన్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలతో రెండు పంటలకు నీరు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Also Read : Hafiz Saeed: ముంబై దాడుల ఉగ్రవాది కుమారుడు మిస్సింగ్.. గజగజ వణుకుతున్న పాకిస్తాన్..
అంతేకాకుండా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు జూటా మాటలు మాట్లాడటం అలవాటు. గోదావరి జలాలు తేస్తే కాలు కడిగి నీళ్ళు చల్లు కుంటామని పలికిన కాంగ్రెస్ నాయకులు ఎటు పోయారు కాంగ్రెస్ పాలనలో మూడు ధర్నాలు, ఆరు అరెస్టులు గా పాలన సాగిందని ఆయన అన్నారు. 180 కోట్ల తో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని, నర్సంపేట లో యంజియం స్థాయిలో ఆసుపత్రి సేవలు రాబోతున్నాయి, 150 మంది వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. మెడికల్ కళాశాల లో ఎల్కేజి ఫీజు అంటే కేవలం పది వేలతో తో డాక్టర్ చదువు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, పక్క రాష్ట్రాల లో అమలు కాని పెన్షన్ పథకం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వి ఆరుపథకాలు కాదు ఆరుగురు ముఖ్యమంత్రులుగా పోటి పడతారని, కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ 5కోట్ల కు అమ్ముకుంటున్నారట గమనించండని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Health Tips : అల్లంతో ఒక్కసారి ఇలా టీ చేసుకొని తాగితే చాలు.. జలుబు ఇట్టే తగ్గుతుంది..