ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగతుంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ… 5,375 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా పట్టించుకోని ఏకైక ప్రభుత్వం మోడీ సర్కార్ అని ఆయన మండిపడ్డారు. సెస్‌ల రూపంలో కేంద్రం వసూలు చేస్తుందని, అప్పుల విషయంలో కేంద్రంది ఏపీకి ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని, వివిధ రూపాల్లో కేంద్రం నుంచి ఒక లక్ష 25 వేల కోట్ల రూపాయలు పైగా రావాలని ఆయన వెల్లడించారు.
Also Read : Smriti Irani Daughter: స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ముస్తాబైన రాజకోట
ఈటల రాజేందర్ మా దగ్గర ఉన్నపుడు బాగానే ఉండే…ఆ పార్టీలోకి పోయినకా ఏమైందో ఏమో ? మా దగ్గర ఉన్నపుడు జన్ కి బాత్ వినే ఈటల.. ఇప్పుడు మన్ కి బాత్ వింటున్నాడు… అదే సమస్య.. కాషాయ పార్టీ లో చేరిన తర్వాత ఏం కషాయం తాపించారో అని అంటూ సెటైర్లు వేశారు హరీష్ రావు. అంతేకాకుండా.. కేసీఆర్ ఫామ్ హౌస్ కి రండి చూపిస్తా.. ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజలు చేస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్‌లో కపిల గోవుకు కేసీఆర్ పూజలు చేస్తారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనివర్సిటీలో తాంత్రిక, చేతబడి కోర్సులు పెట్టారని, తంత్రాలు అయిన కుతంత్రాలైన బీజేపీకే సాధ్యమని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కవులు అయ్యారని క అంటే కనపడదు.. వి అంటే వినపడదు అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. నీతి అయోగ్ ప్రశంసించినా రాష్ట్రంలో విపక్షాలకు కనపడదు…వినపడదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : AK 62: ఆయన ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది…
