రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది బాలింతలు, గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రుల్లో త్వరలో మరో 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే.. నిమ్స్‌లో 250 పడకలు, గాంధీలో 200 పడకలతో ఎంసీహెచ్ (మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్) ఆసుపత్రులు తీసుకువస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కేసీఆర్ కిట్, మిడ్ వైఫరీ వ్యవస్థ, అమ్మ ఒడి వాహనాలు, న్యూట్రిషన్ కిట్ వంటి సదుపాయాలు గర్భిణీలకు కల్పించినట్లు, రాష్ట్రంలో మాతా శిశుసంరక్షణ ఆసుపత్రుల సంఖ్య పెంచుతున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Also Read : Smart Meters: స్మార్ట్ విద్యుత్ మీటర్లుతో ఎన్నో ఉపయోగాలు.. ఆందోళన వద్దు..
మాతా శిశు మరణాల్లో ఒకప్పుడు తెలంగాణ ఐదు, ఆరు స్థానంలో ఉందన్న మంత్రి హరీష్ రావు.. ఏడాదికి లక్షకు 43 మాతాశిశు మరణాలతో ఇప్పుడు మూడో స్థానంలో ఉందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 82శాతం ప్రసవాలు అంటే సగటున నెలకు 1,400 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయని వెల్లడించారు. ప్రసవమైన తర్వాత బాలింతలకు ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయోమో పరిశీలించాలని.. పూర్తిగా పరీక్షించాకే ఇంటికి పంపాలని సూచించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలపాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు.
Also Read : Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం
