NTV Telugu Site icon

Harish Rao : చావునోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన ఘనత మన సీఎందే

Minister Harish Rao

Minister Harish Rao

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మంత్రి హరీష్ రావు 51వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు 60 మోటార్ సైకిల్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనాడు పదవి త్యాగం చేయమంటే చేతకాలేదు కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్సవాలు జరుపుతుంది అనడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అవతరణ దినోత్సవాలను రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వ్యక్తులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు.

Also Read : Rahul Gandhi: మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ

చావునోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని ఆయన అన్నారు. పదవి త్యాగానికి వెనుకాడని వ్యక్తి మన కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న మహానాడు సభలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఒకటి గుర్తు చేసుకోవాలి ఆనాడు నేను తెలంగాణను బాగా డెవలప్ చేసాను కానీ ఇప్పుడు కేసీఆర్ నాకంటే ఎక్కువ అభివృద్ధి చేసిండని చంద్రబాబు చెప్పారన్నారు. సీఎం కేసీఆర్ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు వేస్తున్నదని.. సిద్దిపేట జిల్లా సైతం ఎన్నో కీర్తికిరీటాలను సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి అచేతనావస్థలు… ఇప్పటి అద్భుతమైన స్థితిగతులను మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పసి రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో తొమ్మిదేళ్ల‌లోనే నూరేళ్ల అభివృద్ధిని సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు మంత్రి.

Also Read : Hyderabad : డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..తల్లి పరిస్థితి విషమం..