NTV Telugu Site icon

Harish Rao : ఖమ్మం అభివృద్ధి నా జీవిత లక్ష్యం అని పనిచేసే వ్యక్తి తుమ్మల

Harish Rao

Harish Rao

ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సంక్రాంతి సంబరాలల్లో తెలంగాణా మంత్రులు పాల్గొన్నారు. సత్తుపల్లిలో ఓ మామిడి తోటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశం కార్యక్రమం అనంతరం మామిడితోట అవరణలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బతుకమ్మ సంబరాలు, కేసిఆర్ చిత్రపటాలతో సంక్షేమ పధాకాలు ప్రదర్శన, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితర చిత్ర పాఠాలతో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని అకట్టుకున్నాయి. డుడూ బసవన్నల విన్యాసాలు సంక్రాంతి ముగ్గులను, బోగి మంటల ను మంత్రి హరీష్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. సత్తుపల్లి సన్నహక సభలో‌ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంయే కార్యక్రమం చేపట్టిన సత్తుపల్లిలో అద్భుతంగా జరుగుతుందన్నారు. ఖమ్మం అభివృద్ధి నా జీవిత లక్ష్యం అని పనిచేసే వ్యక్తి తుమ్మల అని ఆయన కొనియాడారు. సత్తుపల్లి పేరు దేశ విదేశాలు చాటి చెప్పిన ఘనత బండి పార్దసారది రెడ్డికి దక్కుతుందన్నారు.

Also Read : Elon Musk: ఈవీ ధరలను భారీగా తగ్గించిన ఎలాన్ మస్క్

ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌ రావు.. తెలంగాణ ఉద్యమం కేసిఆర్ వల్ల అవుతుందా అని.. కొందరు వ్యగంగా మాట్లాడారన్నారు. కరీంనగర్ సభ తెలంగాణ రాజకీయాల్లో మార్పు వచ్చిందని, ఖమ్మం సభ ఆశమాషీ సభ కాదు దేశం గర్వించే సభ అని ఆయన వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాల్లో రోడ్లు అద్వానంగా ఉన్నాయని, రైతుబంధు పథకం‌ కాపీ కొట్టి కేంద్రం ప్రభుత్వం కిసాన్ బీమా ఇప్పుడు అమలు చేస్తుందన్నారు. స్వతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు అయిన ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరధ చేపట్టామని, తెలంగాణ పథకాలు కాపీ కొట్టి దేశం మొత్తం అమలు చేస్తుందన్నారు. దేశం మొత్తం మన తెలంగాణ వైపు చూస్తుందని, తెలంగాణ తరహా పధకాలు ఇవ్వండి లేకపోతే తెలంగాణలో కలపండి అంటూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కొరుకుంటున్నారన్నారు. కోడి పందాలు, క్రికెట్ మ్యాచ్ లు ఉన్న రేపు జరగబోయే ఖమ్మం సభ విజయవంతం చేయాలన్నారు.

Also Read : Exclusive Story on Ambani Companies: అంబరాన్ని తాకుతున్న.. ‘అంబానీ’ వ్యాపార సామ్రాజ్యం..

మన పండుగ ఖమ్మం సభ విజయవంతం అయిన తరువాతనే మనకు పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు. రేపు జరగబోయే సభకు ప్రజలు, కార్యకర్తలతో‌ పాటు రావాలని, నాయకులు‌ కార్లలో కాకుండా ప్రజలతోనే ఏర్పాటు చేసిన వాహనాల్లో రావాలన్నారు. సీపీఐ, సీపీఎం నాయకులు ఖమ్మం‌లో‌ నన్ను‌ కలిశారు వారు వాస్తమని అడిగారన్నారు. గ్రామల్లో ఉన్న సీపీఐ, సీపీఎం నాయకులను కూడా సభకు తీసుకురండని, ఖమ్మం సభ విజయవంతం కావాలంటే తుమ్మల సీనియారిటీ ఉపయోగపడుతుందన్నారు. ఖమ్మం సభ జాతీయ రాజకీయాల్లో పెను మార్పు రానుందని, ఖమ్మం సభను విజయవంతం చేయాలన్నారు. సత్తుపల్లికి ఎప్పుడూ ఏ అవసరం అయిన అందుబాటులో ఉంటానని హరీష్‌ రావు హామీ ఇచ్చారు.