NTV Telugu Site icon

Harish Rao : రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష

Harish Rao

Harish Rao

మెదక్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా..? అని హరీష్‌ రావు ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసేటట్టు కనిపిస్తుందని, కాంగ్రెస్ వచ్చింది..మార్పు మొదలైంది..ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయన్నారు హరీష్‌ రావు. కాంగ్రెస్ వచ్చాక మోటర్ రిపేర్ దుకాణాలు కొత్తవి వెలుస్తున్నాయని, కర్ణాటకలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఎంపీ ఎన్నికల్లో అక్కడ బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు హరీష్‌ రావు. రైతు బంధు పడలేదు అంటే చేప్పుతో కొడుతా అని ఓ మంత్రి, ఇంకో మహిళ మంత్రి అగుతాలేద అంటున్నారని, మాట్లాడితే కేసులు పెడుతున్నారు..పల్లా రాజేశ్వర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.

 

కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి అడిగితే దాడికి దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే ప్ర‌జ‌లు కర్రు కాల్చి వాతపెడతారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ప్ర‌జ‌లు ఓటు వేయ‌రు. పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతుబంధు రూ. 15 వేలకు పెంచలేదన్నారు. పదివేలు కూడా సరిగ్గా రావడం లేదని చెప్పారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. పింఛన్ రూ. 4 వేలు పెరగలేదని చెప్పుకొచ్చారు. వడ్లకు బోనస్ పెరగలేదని.. అక్కాచెల్లెళ్లకు రూ. 2500 రాలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా పింఛన్ పెంచలేదని ధ్వజమెత్తారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ప్ర‌జ‌లు ఓటు వేయ‌రని కీలక వ్యాఖ్యలు చేసారు.