Site icon NTV Telugu

AP DGP: ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియామకం..

Apdgp

Apdgp

ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్‌ కుమార్‌ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం కొన్ని రోజుల పాటు హరీష్‌కుమార్‌ను డీజీపీగా నియమించింది. ఈ నెల 31తో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియనుంది. అనంతరం హరీష్‌కుమార్‌ గుప్తా విధులు స్వీకరిస్తారు.

READ MORE: CPI Ramakrishna: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్..

 

Exit mobile version