Site icon NTV Telugu

Harirama Jogaiah: టీడీపీ-జనసేన బంధాన్ని బలహీన పర్చేందుకు వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు

Harirama Jogaiah

Harirama Jogaiah

ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ సౌకర్యం, ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో కాపు సామాజిక వర్గం బలపరచడం వల్లే వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంది అని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచడానికి వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. వారు చేసే చర్యలు పర్మినెంట్ గా కాపుల భవిష్యత్తును కాలరాయడానికి మాత్రమే ఉపయోగపడతాయన్న విషయాన్ని గమనించకపోవడం దురదృష్టకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన-టీడీపీ కూటమిని ఓడించడమనేది వారు కంటున్న కల మాత్రమే.. వచ్చే ఐదేళ్ళు జనసేన మనుగడకు టీడీపీ ఎంత అవసరమో.. టీడీపీ మనుగడకు జనసేన అంతే అవసరం.. 5 శాతం రిజర్వేషన్ కోసం సీఎంను ఒప్పించడానికి ధైర్యం చేయలేని వైసీపీ కాపులను నమ్మి వారి వెనుక వెళ్ళాలా లేదా అనేది కాపు సామాజిక వర్గంలోని ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ హరిరామ జోగయ్య తెలిపారు.

Read Also: Spider : కాళ్లతో ఊపిరి పీల్చుకునే వింత సముద్రపు సాలీడు

ఇక, కాపులు వైసీపీని వదిలిపెట్టాలని హరిరామ జోగయ్య అన్నారు. గతంలో జనసేన ఓట్లు శాతం 7 నుంచి 15 వరకు పెంచుకోగలింది.. ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలోని 80 శాతం ఓటర్లు జనసేన పార్టీని బలపరచటంతో ఓటర్ల సంఖ్య 51 శాతం నుంచి 44 శాతానికి దిగజారుతున్న తమ పరిస్థితిని గ్రహించిన వైసీపీ కావు సామాజిక వర్గంలో చీలిక తీసుకుని రావటం కోసం ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. అందరం కలిసే వైసీపీని ఓడించాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

Exit mobile version