NTV Telugu Site icon

Harirama Jogaiah: జనసేన సహకారం లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యం

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah: టీడీపీని శాసించే స్థాయిలో ఉండి జనసేన 24 సీట్లకే పరిమితం కావడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన లేఖలో స్పష్టం చేశారు. రాజ్యాధికారంలో పవన్ కల్యాణ్‌కు దక్కే ప్రాధాన్యత తెలుసుకునేందుకు చంద్రబాబును వివరణ కోరడంలో తప్పేంటంటూ పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు హరిరామ జోగయ్య. జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు చూస్తున్నారనే భయం జన సైనికుల్లో ఉందని లేఖలో తెలిపారు జోగయ్య. పవన్‌కి ఇష్టమున్న లేకపోయినా తాను చచ్చే వరకు జనసేన మేలుకోరి పనిచేస్తూనే ఉంటానని జోగయ్య స్పష్టం చేశారు. 40 సీట్లు ఆశించిన జనసైనికులు 24 సీట్లు మాత్రమే రావడంతో ఆగ్రహంతో ఉన్నారన్నారు.

Read Also: MLA KP Nagarjuna Reddy: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..

జనసేన సహకారం లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యమన్నారు. వెన్నుపోటుకి అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవరు నమ్ముతారన్నారు. మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నాయకులు అంటుంటే చంద్రబాబు లోకేష్ నోరు ఎందుకు విప్పరని ఆయన ప్రశ్నించారు. మిమ్మల్ని, మీ పార్టీని నిర్వీర్యం చేయడం టీడీపీ కుతంత్రమా అంటూ ప్రశ్నలు గుప్పించారు. మిత్రులు ఎవరో శత్రువులు ఎవరు తెలుసుకుని పవన్ ప్రవర్తించడం మంచిదని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.