పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కాలం షూటింగ్ జరుపుకున్న చిత్రం అంటే ‘హరిహర వీరమల్లు’ అనే చెప్పాలి. ఈ మూవీ మొదటి నుండి చాలా అడ్డంకులు ఎదురుకుంటూ వచ్చింది. పూర్తయినప్పటికి అనేక వాయిదాల తర్వాత 2025లో విడుదలైన ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణ పీరియడ్ డ్రామాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. అయితే
Also Read : Anil Ravipudi : బాలయ్య ఫ్యాన్స్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన అనిల్ రావిపూడి..
తాజాగా ఈ పార్ట్ 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయిందని హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల తెలపడంతో, మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు అర్థమవుతోంది. దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారని టాక్. కానీ, మొదటి భాగం ఫలితం చూశాక పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ రిస్క్ చేస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మొదటి భాగానికి వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దృష్ట్యా, పవన్ ఈ సీక్వెల్‌ను పక్కన పెట్టడమే బెటర్ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
