Nicholas Pooran accepts Hardik Pandya’s Challenge in IND vs WI 5th T20I: భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్ ఓటమికి వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి.. పొట్టి సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ తొలిసారి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అంతేకాదు హార్దిక్ పాండ్యా చేసిన సవాల్‌కు విండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ ధీటుగా బదులిచ్చాడు. హార్దిక్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లు బాది దూల తీర్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే…
భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు ముందు మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్‌ఎల్‌సీ)లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తరఫున నికోలస్ పూరన్ ఆడాడు. ఎమ్‌ఎల్‌సీలో పూరన్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 40 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ముంబై న్యూయార్క్ ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఎమ్‌ఎల్‌సీ 2023 అనంతరం పూరన్ భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో ఆడాడు.
భారత్‌తో జరిగిన మొదటి టీ20లో నికోలస్ పూరన్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 రన్స్ చేశాడు. రెండో టీ20లో 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 రన్స్ చేసి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మూడో టీ20లో విండీస్ ఓడిపోయినా.. పూరన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 పరుగులు చేశాడు. మూడో టీ20 మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ పూరన్‌ను టార్గెట్ చేశాడు. దమ్ము ఉంటే నా బౌలింగ్‌లో పరుగులు చేయాలని రెచ్చగొట్టాడు. హార్దిక్ సవాల్‌ను పూరన్ స్వీకరించాడు.
Also Read: BCCI DP: ట్విటర్ డీపీ మార్చిన బీసీసీఐ.. కారణం ఏంటంటే?
నాలుగో టీ20లో నికోలస్ పూరన్ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. మూడు బంతులు ఆడి కుల్దీప్ బౌలింగ్‌లో అతడు ఔట్ అయ్యాడు. చివరి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సవాల్‌కు పూరన్ ధీటుగా జవాబిచ్చాడు. కైల్ మేయర్స్ ఔట్ అనంతరం క్రీజులోకి వచ్చిన పూరన్.. మూడు సిక్సర్లు బాదాడు. ఇందులో రెండు హార్దిక్ బౌలింగ్‌లోనే వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ డెలివరీలలో రెండు సిక్సర్లను బాదేసి హార్దిక్ దూల తీర్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Six or nothing for Nicholas Pooran 🔥
A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr
— JioCinema (@JioCinema) August 13, 2023
Hardik Pandya after the 3rd T20i – if Nicholas Pooran wants to hit me for sixes, let him hit me. I enjoy such competition.
Pooran Vs Hardik in the 5th T20i – 6,6 in the first over he bowled. pic.twitter.com/bH9N9DLn58
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2023