NTV Telugu Site icon

Hardik Pandya Viral Video: అనంత్ అంబానీ పెళ్లిలో హార్దిక్ వీడియోపై చర్చ..ఇంతకీ ప్యాండ్యా ఏమి ఆర్డర్ చేశారు..?

Hardik Pandya

Hardik Pandya

భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి జులై 12న దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహానికి హార్దిక్ పాండ్యా కూడా హాజరయ్యారు. ఈ సమయంలో, అతను వెయిటర్ ముందు సైగ చేస్తూ ఏదో ఆర్డర్ చేస్తూ కనిపించాడు.

READ MORE: CM Chandrababu: అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల జాబితా ఇవ్వండి.. పార్టీ నేతలకు చంద్రబాబు సూచన..

అతడు ఏమి ఆర్డర్ చేశారన్ని దానిపై నెట్టింట చర్చ నడుస్తోంది. పలువురు అతడి సైగను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పాండ్యా ‘టేకిలా'(మద్యం) ని సూచించాడని కొందరు చెబుతారు. అయితే వీడియోలో అతను ఏమి ఆదేశించాడో స్పష్టత లేదు. అటువంటి పరిస్థితిలో.. హార్దిక్ ‘టేకిలా’ ఆర్డర్ చేశాడని చెప్పడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా చూడవచ్చు. ఇందులో రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, కత్రినా కైఫ్ తో పాటు పలువురు సెలబ్రెటీలు కనిపింస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఉన్నారు. కాగా.. టెకిలా అనేది మద్యం తాగే అలవాటు ఉన్నవారికి చాలా ఇష్టమైన డ్రింక్. దీనిని టెకిలా షాట్స్ అని కూడా అంటారు. బార్‌లు, పబ్బులకు వెళ్లేవాళ్లు దీన్ని ఉత్సాహంగా తాగుతారు.

Show comments