NTV Telugu Site icon

Team India: శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్లో కెప్టెన్ అతనే..!

Hardhik

Hardhik

శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు సంబంధించి కీలక సమాచారం అందుతోంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌తో పాటు 3 వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీలంకతో జూలై 27 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్‌లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంకా.. బీసీసీఐ నిర్ణయించకపోయినప్పటికీ.., హార్ధిక్కే పగ్గాలు అప్పజెప్పే ఆలోచనలో ఉంది.

Minister Ram Prasad Reddy: ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి ఏమన్నారంటే?

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. రానున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా.. భారత జట్టును టీ20 ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే.. హార్దిక్ పాండ్యా భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు శ్రీలంకతో సిరీస్ కు హార్ధిక్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు.. ఈ క్రమంలో అతను కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Supreme court: సుప్రీంకు ఇద్దరు కొత్త జడ్జీలు.. తొలిసారి మణిపూర్ నుంచి నియామకం

టీ20 సిరీస్ జూలై 27 నుంచి 30 వరకు పల్లెకెలెలో.. వన్డేలు ఆగస్టు 2 నుంచి 7 వరకు కొలంబోలో జరగనున్నాయి. మరికొద్ది రోజుల్లో జట్టును ప్రకటించనున్నారు. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ లేదా సూర్యకుమార్ యాదవ్ ను నియమించనున్నారు. అయితే.. వన్డే సిరీస్‌కు సంబంధించి, వ్యక్తిగత కారణాల వల్ల పాండ్యా విరామం కోరాడని.. దాని గురించి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు తెలియజేసినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోతే స్టార్ క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. కేవలం రోహిత్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు మినహాయింపు ఇచ్చారు. ఆగస్టులో జరిగే దులీప్ ట్రోఫీలో మిగతా టెస్ట్ స్పెషలిస్టులందరూ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని బీసీసీఐ కోరుతోంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది.

శ్రీలంకలో భారత పర్యటన షెడ్యూల్
27 జూలై – 1వ టీ20, రాత్రి 7 గంటలకు, పల్లెకెలె
28 జూలై – 2వ టీ20, రాత్రి 7 గంటలకు, పల్లెకెలె
జూలై 30 – 3వ టీ20, రాత్రి 7 గంటలకు, పల్లెకెలె
2 ఆగస్టు – 1వ వన్డే, మధ్యాహ్నం 2.30, కొలంబో
4 ఆగస్టు – 2వ వన్డే, మధ్యాహ్నం 2.30, కొలంబో
ఆగస్టు 7 – 3వ వన్డే, మధ్యాహ్నం 2.30, కొలంబో

Show comments