Site icon NTV Telugu

Hardik Pandya: పాండ్య పవర్ హిట్టింగ్ చూశారా!

Hardik Pandya Shot

Hardik Pandya Shot

Hardik Pandya: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం రాజ్‌కోట్‌ వేదికగా బరోడా, విదర్భ జట్లు ఆసక్తికరమైన పోరు జరిగింది. ముందుగా టాస్‌ గెలిచిన విదర్భ టీం బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌‌కు దిగిన బరోడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్య పవర్ హిట్టింగ్‌తో 133 పరుగులు చేశాడు. ఒకే ఓవర్లో అయిదు సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టి ఔరా అనిపించాడు. అంత కంటే ముందు ఒకే ఓవర్లో అయిదు సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టి, 68 బంతుల్లో బౌండరీతోనే సెంచరీ నమోదు చేశాడు.

READ ALSO: US-Venezuela war: ‘‘మా అధ్యక్షుడు ప్రాణాలతో ఉన్నాడా?’’.. యూఎస్‌ దాడులపై వెనిజులా..

హార్దిక్ పాండ్యకు లిస్ట్‌ ఏ క్రికెట్‌లో ఇదే ఫస్ట్ సెంచరీ. మిగతా బ్యాటర్లంతా రన్స్ చేయడంలో బ్యాట్లు ఎత్తేశారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్‌ను క్రాస్ చేయలేదు. సొలంకీ 26, కృనాల్‌ పాండ్య 23, షెత్‌ 21 మాత్రమే ఓ మోస్తరు స్కోర్ చేశారు. విదర్భ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ 4, పార్థ్‌, నచికేత్‌లు తలో 2, ప్రఫుల్‌ 1 వికెట్‌ పడగొట్టారు. అనంతరం విదర్భ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో విదర్భ 294 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.

READ ALSO: US Attacks Venezuela: అమెరికా చెరలో వెనిజులా అధ్యక్షుడు.. “పిరికిపంద” అంటూ ఖండించిన మిత్ర దేశాలు..

Exit mobile version